హస్మత్‌పేట్‌లో హైడ్రా భారీ కూల్చివేతలు,
పురావస్తు శాఖ భూములపై అక్రమ నిర్మాణాల తొలగింపు నోటరీ పేరిట భూముల విక్రయాలపై కలకలం..
మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూన్ 27 మన వార్త :హస్మత్‌పేట్ చత్రిగడ్డ సర్వే నంబర్-1లో పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూములపై వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
స్థానికంగా విలువైన ఈ భూములను కొందరు వ్యక్తులు నోటరీ పత్రాల ఆధారంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గజానికి సుమారు రూ.30 వేల చొప్పున విక్రయిస్తూ, భవిష్యత్తులో క్రమబద్ధీకరణ జరుగుతుందని కొనుగోలుదారులను నమ్మించినట్లు సమాచారం.
ఇప్పటికే వందలాది మంది ఈ మోసానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.
అంతేకాకుండా, ప్రభుత్వ భూములను ప్రైవేటు పట్టా భూములుగా చూపిస్తూ తప్పుడు సర్వే నంబర్లతో నోటరీ పత్రాలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొందరు కొనుగోలుదారులు ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించగా, హైడ్రా చర్యలతో అవి కూల్చివేయబడ్డాయి.
ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల ప్రమేయంపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
భూముల రక్షణలో పురావస్తు శాఖ నిర్లక్ష్యం వహించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ శాఖ ఇప్పటికే ఈ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
Medchal -Malkajgiri District
హస్మత్‌పేట్‌లో హైడ్రా భారీ కూల్చివేతలు, పురావస్తు శాఖ భూములపై అక్రమ నిర్మాణాల తొలగింపు నోటరీ పేరిట భూముల విక్రయాలపై కలకలం..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని

