ఇల్లంతకుంట,జూలై 16 (మన వార్త ప్రతినిధి):
ఫసల్ బీమా యోజనను తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం రేపాక గ్రామంలోని నరసింహస్వామి ఆలయం నుంచి ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ,రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం,ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.పథకం అమలు కాకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు భరోసా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.అతివృష్టి,అనావృష్టి,అగ్నిప్రమాదాలు,ఈదురుగాలులు,వడగళ్ల వానలతో పంటలు దెబ్బతింటున్న రైతులను ఆదుకోవాలంటే ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఎన్నికల హామీ మేరకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా,కౌలు రైతులకు రూ.12 వేల ఆర్థిక సాయం తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
ఫసల్ బీమా అమలు చేయాలి..బీజేపీ పాదయాత్ర..తహసీల్దార్‌కు వినతి
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త