మొహర్రం సందర్భంగా మచ్చ బొల్లారంలో షర్బత్ పంపిణీ చేసిన మైనారిటీ నాయకుడు మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో .
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 26 మన వార్త :మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని అల్వాల్ మండలంలోని మచ్చ బొల్లారం 191వ డివిజన్‌లో మైనారిటీ నాయకుడు మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా షర్బత్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మొహర్రం పర్వదినం త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మచ్చ బొల్లారం సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ డోలి రమేష్, డివిజన్ బీఆర్ఎస్ నాయకులు చెలిమెల మహేష్, మలిదశ పుట్నాల కృష్ణ, ఉద్యమ వీరుడు మంద శోభన్ బాబు, సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డి, అధిక్ భాష, ఫరీద్ తదితరులు పాల్గొని ప్రజలకు షర్బత్ పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
Medchal -Malkajgiri District
మొహర్రం సందర్భంగా మచ్చ బొల్లారంలో షర్బత్ పంపిణీ చేసిన మైనారిటీ నాయకుడు మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో .
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని