1000 డయా మంచినీటి పైప్‌లైన్ పగులు..అల్వాల్–సుచిత్ర రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం..
మేడ్చల్ మల్కాజ్‌గిరి,జిల్లా జూలై 9 ప్రతినిధి మన వార్త : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్, మంగాపురం కాలనీ ఫేజ్–3 వద్ద 1000 డయా మంచినీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు వృథాగా ప్రవహిస్తోంది. దీంతో అల్వాల్ నుంచి సుచిత్ర వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రహదారిపై నీరు నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం నెలకొంది. అలాగే వాహనాల రాకపోకలు మందగించి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణించే ఈ రహదారిపై పైప్‌లైన్ పగిలిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల లీటర్ల తాగునీరు వృథా అవుతుండగా, నీటి ఒత్తిడి తగ్గి సమీప కాలనీలకు సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి పగిలిన 1000 డయా పైప్‌లైన్‌ను మరమ్మతు చేసి, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Medchal -Malkajgiri District
1000 డయా మంచినీటి పైప్‌లైన్ పగులు..అల్వాల్–సుచిత్ర రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
