తుడిమెళ్ల మల్లికార్జున్ కృషితో వాంబే కాలనీ రాజీవ్ గృహకల్ప లో వెలుగులు,కౌకూర్ 42 నూతన వీధి దీపాల ఏర్పాటు..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 29 మన వార్త :చీకట్లోనే జీవనం సాగిస్తున్న కౌకూర్ వాంబే కాలనీ వాసుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ల మల్లికార్జున్ చేసిన నిరంతర కృషి, మైనంపల్లి హనుమంతరావు సహకారంతో కాలనీలో 42 నూతన వీధి దీపాలను ఎంఎంసీ విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది.
కౌకూర్‌లోని వాంబే కాలనీలో అత్యధికంగా నిరుపేద, దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో ప్రభుత్వాలు మారినా, కాలనీలో కనీస మౌలిక వసతులైన వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు భయాందోళనల మధ్య రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉండేది.
ఈ నేపథ్యంలో కాలనీ ప్రజల సమస్యను గుర్తించిన తుడిమెళ్ల మల్లికార్జున్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, ఎంఎంసీ విద్యుత్ శాఖ స్పందించి 42 వీధి దీపాలను ఏర్పాటు చేసింది. దీంతో కాలనీలో రాత్రివేళ వెలుగులు నిండగా, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తుడిమెళ్ల మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, మల్కాజిగిరి జోన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సహకరిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పనులను త్వరితగతిన పూర్తి చేసిన ఎంఎంసీ మల్కాజిగిరి జోన్ విద్యుత్ శాఖ డీఈ కవితను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ అధ్యక్షుడు చందు, శ్రీకాంత్, కోటి చారి, ముజమ్మిల్ ఖాన్, రాజ్‌కుమార్, సందీప్, రాజు, ఎల్లయ్య, కిషోర్, యాదగిరి, రమేష్, కిరణ్, లావణ్య, రాధిక, నర్సమ్మతో పాటు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
స్థానికులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వీధి దీపాల సమస్య పరిష్కారం కావడంతో కాలనీలో భద్రత, సౌకర్యం పెరిగిందని, ఇకపై రాత్రి వేళల్లో ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చని ఆనందం వ్యక్తం చేశారు.
Medchal -Malkajgiri District
తుడిమెళ్ల మల్లికార్జున్ కృషితో వాంబే కాలనీ రాజీవ్ గృహకల్ప లో వెలుగులు,కౌకూర్ 42 నూతన వీధి దీపాల ఏర్పాటు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
