అల్వాల్‌లో ఏసీబీ సోదాలు.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో తనిఖీలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 23 మన వార్త : అల్వాల్ జీహెచ్ఎంసీ పరిధిలోని మచ్చ బొల్లారం సూర్యనగర్‌లో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో తెల్లవారుజాము నుంచి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, వెంకటేశ్వర ఎన్‌క్లేవ్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఉదయం నుంచే ఏసీబీ అధికారుల రాకపోకలతో సూర్యనగర్ ప్రాంతంలో సందడి నెలకొనగా, స్థానికంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Medchal -Malkajgiri District
అల్వాల్‌లో ఏసీబీ సోదాలు.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో తనిఖీలు.
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
