గొల్లగూడెం బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు కుంగుదల
వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు..
వాజేడు జూన్ 21 మనవార్త
మండలంలోని గొల్లగూడెం చీకుపల్లి గ్రామల మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి సమీపంలో వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కుంగిపోయింది.దీంతో ధర్మారం, పేరూరు, చండ్రుపట్ల 25 గ్రామాలకు,ఛత్తీస్గఢ్ నుండి వచ్చే వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.ఘటనా స్థలంలో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు వెంటనే రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Telangana
వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు
Quick Summary:
కవిరాజు