రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
:జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు జులై 08 మనవార్త
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తన ఛాంబర్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు.జిల్లాలో ఇప్పటివరకు 98.96 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, 25.79 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు.ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వివరాలు నింపే ప్రక్రియలో, ఓటర్ల నుంచి తిరిగి ఫారాలను స్వీకరించడం లో బీఎల్‌వోలకు రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.బీఎల్‌వోలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నారని తెలిపారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 24న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, ఆర్డీవో కృష్ణవేణి, ఎన్నికల సూపరింటెండెంట్ సలీం, డీటీ నితీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చాంద్ పాషా, బీజేపీ ప్రతినిధులు ఎస్. బలరాం, రవీంద్ర చారి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి భూక్యా రాందాస్, సీపీఎం ప్రతినిధి రాజేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సహకారంతో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమన్ని విజయవంతం చేయాలి
Quick Summary:
కవిరాజు