ఇల్లంతకుంట,జూన్ 21 (మన వార్త ప్రతినిధి);
యోగా శారీరక,మానసిక,ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని ఎస్సైలు అశోక్,లక్పతి అన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం యోగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు,సిబ్బంది,విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.అనంతరం ఎస్సై సిరిసిల్ల అశోక్ మాట్లాడుతూ భారతీయ తత్వం ప్రతిపాదించే సార్వత్రిక విలువల మాదిరిగానే యోగ కూడా విశ్వవ్యాప్త భావనలను,ప్రాపంచిక దృక్పథాన్ని బోధిస్తుందన్నారు.యోగాలోని శక్తి,ప్రాముఖ్యత,రోగనిరోధక సామర్థ్యాన్ని గుర్తించిన ప్రపంచ దేశాల ప్రజలు దానిని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటున్నారని తెలిపారు.యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏఎస్‌ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు,కానిస్టేబుళ్లు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
ఆరోగ్యానికి యోగ బాట...పోలీసులు,విద్యార్థులతో యోగాసనాలు..
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త