సిద్దిపేట జిల్లా గజ్వేల్ తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నియోజకవర్గ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు గజ్వేల్ లో జాలిగామ బైపాస్ రోడ్డులో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా విశ్వకర్మ మనుమయ సంఘం అధ్యక్షులు గడియారం వెంకటాచారి, ఉపాధ్యక్షులు గడియారం స్వామి చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన కృషి, అందించిన సిద్ధాంతాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో పనిచేసి, ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, విశ్వకర్మల ఐక్యతకు, హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వఖర్మ మనుమయ సంఘం ప్రధాన కార్యదర్శి విఠలాచారి, కోశాధికారి గడియారం నాగరాజు చారి లక్ష్మీనరసింహ చారి, ఉపాధ్యక్షులు గడియారం వెంకటేశం చారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అధ్యక్షులు కొక్కొండ శ్రీనివాస్ చారి, సంఘం సభ్యులు ధర్మయ్య వెంకటేశం బ్రహ్మచారి సత్యం భాస్కర్ శివ, తదితరులు పాల్గొన్నారు
Telangana
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
Quick Summary:
MURALI STAFF REPORTER
