తుర్కపల్లి 190వ డివిజన్‌లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం,
834 మంది చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 29మన వార్త :పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం తుర్కపల్లి 190వ డివిజన్ పరిధిలోని ఏఆర్కే హోమ్స్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా మొత్తం 834 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాహకులు, పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలు ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా తల్లిదండ్రులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో 190వ డివిజన్ అధ్యక్షుడు చెలిమెల మహేష్, జేఏసీ నాయకుడు పుట్నాల కృష్ణ,మలిదశ ఉద్యమకారుడు శోభన్ బాబు, తుర్కపల్లి బొల్లారం బిఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక నాయకులు, ప్రజలు సమిష్టిగా సహకరించారు.
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రజల్లో అవగాహన పెంపొందించి, పోలియో రహిత భారత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
Medchal -Malkajgiri District
తుర్కపల్లి 190వ డివిజన్‌లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం, 834 మంది చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని