వెంకటాపురం యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 24 మన వార్త : యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో వెంకటాపురం యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ లక్ష్మణ్ రాజ్, ఎస్‌ఐ రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని వివరించారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ కలిసి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.
Medchal -Malkajgiri District
వెంకటాపురం యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని

