ఇల్లంతకుంట,ఆగస్టు 1 (మన వార్త ప్రతినిధి):
తెలంగాణ గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం (వీబీ-గ్రామ్ జి జేఏసీ) పిలుపు మేరకు ఇల్లంతకుంట మండల ఎంపీడీవో కార్యాలయం ఎదుట శనివారం ఉద్యోగులు పోస్టర్లతో నిరసన వ్యక్తం చేశారు.వేతన స్కేలు అమలు,పదోన్నతులు,సర్వీసు సీనియారిటీ ఖరారు,కార్యాలయ సిబ్బందికి అదనపు నెలవారీ నగదు రూ.5 వేలకు,క్షేత్రస్థాయి ఉద్యోగుల ప్రయాణ భత్యాన్ని రూ.6 వేలకు పెంచడంతో పాటు గ్రాట్యుటీ,ఈపీఎఫ్,ఆరోగ్య పథకం అమలు సహా 12 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.లేనిపక్షంలో పెన్‌డౌన్,ధర్నా,షట్‌డౌన్ వంటి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ పులి చంద్రయ్య,టిఏలు శ్రీనివాస్,పుష్పలత,కరుణాకర్,హరీష్ కుమార్,సిఓలు తబిత,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
డిమాండ్ల సాధనకు వీబీ-గ్రామ్ జి ఉద్యోగుల నిరసన..ఎంపీడీవో కార్యాలయం ఎదుట పోస్టర్లతో ఆందోళన...
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త ప్రతినిధి..✍️

