మల్కాజ్గిరి ఇంచార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాపురం డివిజన్‌లో,ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహణ..
మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 6 మనవార్త : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వెంకటాపురం డివిజన్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తోట లక్ష్మి కాంత్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని 65 శాతం పూర్తి అయిందని అన్నారు. కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తుల నింపడం, అవసరమైన వివరాల సేకరణలో ప్రజలకు సహకారం అందించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సేవలను చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ భబిత, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు శేఖర్, కాంగ్రెస్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, నాగేశ్వరరావు, శివ, లక్ష్మి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళా నాయకులు, యువజన ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ప్రజలకు మరింత చేరువయ్యేలా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కూడా విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
Medchal -Malkajgiri District
మల్కాజ్గిరి ఇంచార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాపురం డివిజన్‌లో,ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహణ..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని