వీధి దీపాలు లేక శ్రీనగర్ కాలనీవాసుల అవస్థలు,
చీకట్లోనే రాకపోకలు.. వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికుల విజ్ఞప్తి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 10 మన వార్త :అల్వాల్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని 190వ డివిజన్ మచ్చ బొల్లారం శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.10లో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో కాలనీలో పూర్తిగా చీకటి నెలకొనడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి కారణంగా పాములు, విష పురుగుల బెడదతో పాటు చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి వీధి దీపాలను మరమ్మతు చేసి, కాలనీలో వెలుతురు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల భద్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Medchal -Malkajgiri District
వీధి దీపాలు లేక శ్రీనగర్ కాలనీవాసుల అవస్థలు, చీకట్లోనే రాకపోకలు.. వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికుల విజ్ఞప్తి..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని