Telangana
గజ్వేల్ నుండి జాలిగామ వెళ్లే రోడ్డు గుంతల మయం వాహనదారుల నరకయాతన
Quick Summary:
MURALI STAFF REPORTER
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి జాలిగామ వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు, సరైన నిర్వహణ లేకపోవడంతో రోడ్డు మొత్తం అధ్వాన్నంగా తయారైంది,రహదారి పొడవునా భారీ గుంతలు ఏర్పడి, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులు గుంతలను గమనించక కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నారు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల విడిభాగాలు దెబ్బతింటూ వాహనదారులకు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది, ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే స్థానికులు వణికిపోతున్నారు, ముఖ్యంగా స్కూల్ పిల్లలు, గర్భిణులు, అత్యవసర వైద్యం కోసం గజ్వేల్ వచ్చే రోగులు ఈ గుంతల రోడ్డుపై ప్రయాణించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, యుద్ధప్రాతిపదికన ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని, తాత్కాలికంగానైనా గుంతలను పూడ్చి ప్రమాదాలను నివారించాలని జాలిగామ గ్రామస్తులు మరియు వాహనదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు, ఈ విషయంపై వివిధ పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన, అధికారులు స్పందించకపోవడం శోచనీయం పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
